కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ గా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 2 లక్షల పైగా ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్టిఫికెట్ ను బండి సంజయ్ కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి బి.వినోద్ కుమార్‌పై బండి సంజయ్ విజయం సాధించారు. ఈ విజయంతో బండి సంజయ్ రెండోసారి కరీంనగర్ ఎంపీగా విజయం సాధించారు. 2019లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి 89,508 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో అంతకు మించి ఆధిక్యాన్ని బండి సంజయ్ సాధించారు. ఈ విజయం తో కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం బీజేపీ ఖాతాలోకే చేరింది. సిట్టింగ్ స్థానమైన కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ స్థానాన్ని ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ భారీ విజయం సాధించారు.
Posted inతాజావార్తలు
2 లక్షల భారీ మెజార్టీతో బండి సంజయ్ ఘన విజయం
