కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:


ఢిల్లీ: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ గురువారం ఉదయం 10.35 నిమిషాలకు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ మరియు మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ సమక్షంలో హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఢిల్లీలోని పార్లమెంట్ నార్త్ బ్లాక్‌లో హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. భద్రతా కారణాల వల్ల కార్యకర్తల హడావిడి, నాయకుల సందడి లేకుండా సంజయ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇందుకు నాయకులు, కార్యకర్తలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కిషన్ రెడ్డికి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), బీజేపీ తెలంగాణ కేడర్కు, మీడియాకు, సోషల్ మీడియా యోధులకు మరియు మరీ ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.