హుస్నాబాద్ లో ఘనంగా బండి సంజయ్ జన్మదిన వేడుకలు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 53వ జన్మదిన పురస్కరించుకొని హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. బిజెపి హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా 40 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథలు గా విచ్చేసిన సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి పాలుగొని మాట్లాడుతూ… బండి సంజయ్ కుమార్ సాధారణ కార్పొరేటర్ స్థాయి నుండి అలుపెరుగని పోరాటం చేస్తూ రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నికయి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి గా బాధ్యతలు చేపట్టడం హర్షనీయమని ఇది బిజెపి లోని ప్రతి కార్యకర్తకు మార్గదర్శనమని కొనియాడారు. నేడు వారి జన్మదిన సందర్భంగా మరియు దుర్గ అమ్మవారు వారికి ఆయురారోగ్యాలను శక్తిని ప్రసాదించాలని సంజయ్ కేవలం కరీంనగర్ పార్లమెంట్తో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… కరీంనగర్ పార్లమెంటును రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో అన్ని పార్టీల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తానని చెప్పడం చాలా సంతోషకరమని హుస్నాబాద్ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంత అభివృద్ధిపై వారికి ప్రత్యేక శ్రద్ధ ఉందని చెప్పారు. 53వ జన్మదిన సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో ఉండాలని మహాశక్తి అమ్మవారు చల్లగా చూడాలని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ప్రభరి గుజ్జ సత్యనారాయణ రావు, కన్వీనర్ గుర్రాల లక్ష్మారెడ్డి, కోకన్వీనర్ వేణుగోపాలరావు, హనుమకొండ జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు లక్కిరెడ్డి తిరుమల, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నీలం దినేష్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని సతీష్, మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తోట స్వరూప, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, వివిధ మండల పార్టీల అధ్యక్షులు రాజేంద్రప్రసాద్, రామంచ మహేందర్ రెడ్డి, కందుల శ్రీనివాస్ రెడ్డి, పైడిపల్లి శ్రీనివాస్, పైడిపల్లి పృథ్వీరాజ్, కూడుతాడి చిరంజీవి, మాజీ మండలాధ్యక్షులు శంకర్ బాబు, వీరాచారి, సీనియర్ నాయకులు కొత్తపల్లి అశోక్ వివిధ మండలాల బిజెపి నాయకులు పాలుగోన్నారు.