హుస్నాబాద్: హిందూ సంఘాల బంద్ విజయవంతం
సంపూర్ణ మద్దతు తెలిపిన పట్టణ ప్రజలు
బంద్ లో పాల్గొన్న హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్, హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ శనివారం హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన హుస్నాబాద్ బంద్ విజయవంతమైంది. వ్యాపార వాణిజ్య సంస్థలతోపాటు ప్రైవేటు విద్యా సంస్థలు బంద్‌లో పాల్గొన్నాయి. బంద్ కారణంగా మార్కెట్ ఏరియా, మెయిన్ రోడ్డు, అక్కన్నపేట చౌరస్తా, మల్లె చెట్టు చౌరస్తా నిర్మానుష్యమైంది. హిందూ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ గౌరిశెట్టి ప్రకాశం, విశ్వహిందూ పరిషత్ భార్గవపురం కండ ప్రముఖ చందుపట్ల నాగరాజు ఆధ్వర్యంలో మల్లె చెట్టు చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీని నిర్వహించారు. బంద్‌కు సహకరించిన వ్యాపారస్తులకు, విద్యాసంస్థల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింస పట్ల, మారణ హోమం పట్ల భారత దేశం లోని కాంగ్రెస్ పార్టీ, వామపక్ష పార్టీలు, హక్కుల సంఘాలు ఎందుకు ఖండించడం లేదని అన్నారు.
హుస్నాబాద్ బంద్ కు సహకరించిన పట్టణ ప్రజలకు వాణిజ్య, వ్యాపార, వర్తక సంఘాల కు హుస్నాబాద్ హమాలీ సంఘం నాయకులకు గౌరీశెట్టి ప్రకాష్ మరియు బిజెపి హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు&కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్ లు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దొడ్డి శ్రీనివాస్, చిట్టి గోపాల్ రెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డి, కాగిత భాస్కర్ రెడ్డి, రామంచ మహేందర్ రెడ్డి, కల్లేపల్లి పరుశురాం జి, బత్తుల శంకర్ బాబు, గొల్లపల్లి వీరాచారి, కర్ణకంటి నరేష్, భూక్య సంపత్ నాయక్, గాదాస్ రాంప్రసాద్, తగరం లక్ష్మణ్, ఎర్రోజు సాయి, చెరుకు సంపత్, ఆషాడం శ్రీనివాస్, నా రోజు నరేష్, వెళ్లండి సంతోష్, బొల్లి సుధాకర్, బాలరాజు, వడ్డేపల్లి లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు