బహుజన ముద్దుబిడ్డ “డాక్టర్ ప్రసన్న హరికృష్ణ” గెలుపు ఖాయం
తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కండె సుధాకర్
సిద్దిపేట టైమ్స్ భీమదేవరపల్లి ఫిబ్రవరి 26 :
తెలంగాణ రాష్ట్రంలో నేడు జరుగుతున్న ఉమ్మడి మెదక్,కరీంనగర్,ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కండె సుధాకర్ అన్నారు.ఈ సందర్భంగా బుధవారం విలేకరుల ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రెండు జాతీయ పార్టీలతో పోటీ పడుతున్న ప్రసన్న హరికృష్ణ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక కామన్ మ్యాన్, విద్యావంతుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ తన ఉద్యోగ జీవితం ఇంకా 19 సంవత్సరాలు ఉండగా,ఈ రాష్ట్రంలోని బహుజనులను అణగదొక్కుతున్నటువంటి పరిస్థితులను చూసి రాజ్యాధికారం ద్వారా మన అడ్డడుగు బహుజన వర్గానికి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో,తన పదవికి రాజీనామా చేసి పట్టభద్రుల ఎమ్మెల్సీఅభ్యర్థిగా బరిలో నిలిచాడన్నారు.నోట్ల కట్టలు, వేల కోట్ల సంపద ఉన్న వ్యక్తులు ఎన్నికలు రాగానే పార్టీల కండువాలు వేసుకొని,డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కున్న నాయకులకు ఓట్లేద్దామా,సామాజిక స్పృహ ఉన్నా ఒక మేధావి,బహుజన సిద్ధాంతపరుడు మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకుపోగల సత్తా ఉన్నటువంటి డాక్టర్ ప్రసన్న హరికృష్ణకు ఓటేద్దామా పట్టభద్రులు ఆలోచన చేయాలన్నారు.డాక్టర్ ప్రసన్నహరి కృష్ణను శాసన మండలికి పంపించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.కాంగ్రెస్ పార్టీకి చిత్త శుద్ధి ఉంటే ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల్లో మేధావులు లేరా,, మరి ఎందుకు రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు ఇస్తున్నారన్నారు. ఇంకెన్నాళ్లు మా ఓట్లు వేసుకొని మీరు అధికారంలో ఉంటారని ప్రశ్నించారు.రోజులు మారినాయి కచ్చితంగా ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీ ల నుండి బరిలో ఉన్న నాయకులకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. విద్యావంతుడు,జ్ఞానవంతుడు డాక్టర్ ప్రసన్న హరికృష్ణను గెలిపించుకోవడం అందరి బాధ్యత అన్నారు.నేడు పోలింగ్ బూత్ మొదలవగానే అందరూ పోలింగ్ బూతులకు వెళ్లి,,సీరియల్ నెంబర్ (3)పై మొదటి ప్రాధాన్యత ఓటు(1) వేసి భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు.
Posted inహుస్నాబాద్
బహుజన ముద్దుబిడ్డ “డాక్టర్ ప్రసన్న హరికృష్ణ” గెలుపు ఖాయం
