సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్


జెడ్ పి హెచ్ ఎస్ (బాలురు) హుస్నాబాద్ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల లో గల సౌకర్యాలను మరియు ప్రయోజనాలను బ్యానర్ ద్వారా ప్రదర్శిస్తూ , పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో పిల్లలందరినీ బడిలో చేర్పించుటకు ప్రతిజ్ఞ చేసి, అనంతరం రోజువారీ కార్యక్రమాల యువజన చేశారు. పాఠశాల విద్యార్థుల నమోదు పెంచుటకు ప్రణాళికలు తయారు చేసి, ప్రతిరోజు చేయవలసిన పనులను నిర్ణయించుకొని పాఠశాల క్యాచ్మెంట్ ఏరియా లోని బడి బయటి పిల్లలను, డ్రాప్ అవుట్ పిల్లలను, పాఠశాలలో నమోదు చేయుటకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కొండ్ల వాసుదేవరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బెజ్జంకి వరలక్ష్మి, స్వయం సహాయక సంఘాల లీడర్లు గడిపే రజిత, గడిపే నరసమ్మ, మరియు ఎగ్గొజు సుదర్శన చారి, మునిసిపల్ ఏఈ సాయి కుమార్, ఉపాధ్యాయులు వీరారెడ్డి, సువర్ణ లీల, వెంకటరమణారెడ్డి, సుభాష్, రాజమల్లు, శ్రీనివాస్, మార్కండేయ, రాజేందర్, రమేష్, శ్రీధర్, రజిత, రాజమౌళి, భాస్కర్ మరియు CRP లు జ్యోత్స్న, స్వప్న తదితరులు పాల్గొన్నారు.