చెత్త రీసైక్లింగ్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

బుధవారం హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవ 2024 కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న అధ్యక్షతన C V రామన్ స్కూల్ మరియు మాంటిస్సోరి స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు DRCC మరియు కంపోస్ట్ షెడ్ వద్ద అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ మాట్లాడుతూ ఇంటి దగ్గర వేరు చేసి ఇచ్చిన చెత్త లో పొడి చెత్తను DRCC వద్దకు తీసుకొచ్చి రీసైక్లింగ్ లేదా రివ్యూ చేసుకోవచ్చని, తడి చెత్తను కంపోస్ట్ కి తీసుకువచ్చి ఎరువు తయారుచేసుకొని మొక్కలకు వాడుకోవచ్చని, మీ తల్లిదండ్రులకు ఇంటి వద్దనే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని, చెత్త వేరు చేసిన తర్వాత ప్రాసెసింగ్ జరిగే విధానాన్ని విద్యార్థులకు వివరిస్తూ, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని తెలియజేశారు. ఇందులో భాగంగా స్కూల్ పిల్లలందరూ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసి వ్యాసరచన పోటీ లో పాల్గొన్నారు .
ఈ కార్యక్రమంలో కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ అనిత, కౌన్సిలర్స్ నళిని దేవి, రవి, హరీష్, స్కూల్ ప్రిన్సిపల్స్, సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, వన మహోత్సవ సూపర్వైజర్ శంకర్,పర్యావరణ అధికారి రవికుమార్, వార్డ్ ఆఫీసర్లు, మెప్మ ఆర్పిలు, స్కూల్ విద్యార్థి విద్యార్థులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.