ఆర్టీసీ కార్గో సేవలను ప్రజలు వినియోగించుకోవాలి
రాఖీ పండుగ సందర్భంగా ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు
పార్శిళ్లు, కొరియర్ కవర్లు తక్కువ చార్జీతో వేగంగా రవాణా
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ వి. రామారావు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

ఆర్టీసీ అమలు చేస్తున్న కార్గో సేవలను ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (ఏటీఎం)) V. రామారావు కోరారు. లాజిస్టిక్ మేనేజర్ గా నూతనంగా బాధితులు స్వీకరించిన అనంతరం మొదటిసారి హుస్నాబాద్ బస్టాండ్ లో గల ఆర్టీసీ కార్గో కార్యాలయంను గురువారం సందర్శించిన అనంతరం మాట్లాడుతూ…ఆర్టీసీ అమలు చేస్తున్న కార్గో సేవలను ప్రజలు సద్వి నియోగ చేసుకోవాలని, ఆగస్టు 19 రాబోయే రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక కౌంటర్లను హుస్నాబాద్ తోపాటు పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేశామని తెలిపారు. రాబోయే రాఖీ పండుగను పురస్కరించుకుని ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుతో స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని ఆడపడుచులు టిజిఆర్టీసి కార్గో, పార్శిల్ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరల్లో రాఖీలను తెలంగాణ తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పంపించుకోవచ్చని తెలిపారు. రాబోయే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈరోజు సైదాపూర్ లో నూతన కౌంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. అంతేకాకుండా మారుమూల ప్రాంతాలైన కోహెడ, అక్కన్నపేట, చిగురుమామిడి లలో కూడా ఈ ప్రత్యేక సేవలను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో కార్గో సేవలను వినియోగిస్తున్న కస్టమర్లను కలిసి వారికి అందుతున్న సేవలు గురించి తెలుసుకున్నారు.
హుస్నాబాద్ పట్టణ, పరిసర ప్రాంత ప్రయాణికులకు టీజిఆర్టీసీ ద్వారా పార్శిల్, కొరియర్ సర్వీసు(కార్గో) తెలుగు రాష్ట్రాలోని అన్ని పట్టణాలకు అందుబాటులో ఉందని తెలిపారు. హుస్నాబాద్ బస్టాండ్ ఆవరణలోని కార్గో కౌంటర్ నుంచి హైదరాబాదు లాంటి దూర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలకు పార్శిళ్లు, కొరియర్ కవర్లు తక్కువ చార్జీతో వేగంగా రవాణా చేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని హుస్నాబాద్ పరిసర ప్రాంత ప్రయాణికులు వినియో గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వివరాలకు లాజిస్టిక్ సేల్స్ టీమ్ లీడర్ జి రాజు 9154298581, సేల్స్ టీం సభ్యుడు సురేష్ 91542 98673 , మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ LP రాములును సంప్రదించవచ్చునని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీల్స్ టీం లీడర్ జి. రాజు, సేల్స్ టీం సభ్యుడు సురేష్, ఆపరేషన్ టీం సభ్యులు అన్వేష్, చంద్రమౌళి, ఎల్.పి రాములు మరియు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
