కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకాక ప్రతిపక్షాలపై దాడులు…
ప్రజా పాలన అంటే న్యాయం అడిగే నాయకుల గొంతు నొక్కడమేనా…
బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లిఖార్జున్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రాష్ట్రం లోనీ ప్రధాన ప్రతిపక్షం అయినా బీఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే వారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వం ప్రజా సమస్యలను తీర్చకుండా కాలం గడుపుతుందని హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు.
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక మంది రైతుల పంట పొలాలు కొట్టుకపోయి, చెరువులు కుంటలు తెగిపోయి, రాష్ట్రంలో దాదాపు 15 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. వేలాది ఇల్లు కూలిపోయి వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రధాన ప్రతి పక్షం అయినా బీఆర్ఎస్ పార్టీ కీ చెందిన ఎమ్మెల్యేలు ఖమ్మం జిల్లాలో ప్రజలు కష్టాల్లో ఉన్నారని వారికి కొంత సహాయం చేద్దాం అని వారిని కలిస్తే అది చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పై కొంత మంది గుండాలు చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడిని ఖండించారు. ఇలాంటి దాడులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని తెలిపారు. ప్రభుత్వానికి చేతనైతే ఎమ్మెల్యేలపై దాడులు చేసిన వారినీ అరెస్టు చేయలని, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం పని చేయాలి తప్ప ప్రతిపక్షాలపై అనవసరపు విమర్శలు చేస్తూ అధికార కాలాన్ని గడపద్దని కోరారు.
వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు, కాలువలకు మరమ్మతులు చేపట్టాలి…..
హుస్నాబాద్ ప్రాంతంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు, కాలువలకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని, వర్షంతో రోడ్లన్నీ గుంతలు పడడం వలన మోటర్ వాహనల పై ప్రయాణించే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని, అదే విధంగా పట్టణంలో వరద నీటికి కాలువలు తెగిపోయాయని, వాటిని సరి చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.