దారుణం.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన గురించి బాలిక సోమవారం రాత్రి తన తల్లికి వివరించింది. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు హుస్నాబాద్ సీఐ శ్రీను తెలిపారు. అత్యాచారం చేసిన ముగ్గురు యువకులు బాలిక ఉంటున్న కాలనీకి చెందినవారుగా గుర్తించినట్లు చెప్పారు. బాలికను వైద్య పరీక్షలకు పంపినట్లు సీఐ తెలిపారు.