మేడ్చల్లో దారుణం.. బుర్కా వేసుకుని దోపిడీకి ప్రయత్నం..
సిద్దిపేట టైమ్స్, బ్యూరో : మేడ్చల్ లో గురువారం దారుణ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పట్టణంలోని జగదాంబ బంగారం షాప్ లో ఇద్దరు దుండగులు దోపిడీకి ప్రయత్నం చేశారు. దుండగులు బుర్కా వేసుకుని టూ విలర్ వాహనం పై వచ్చారు. కత్తితో షాప్ యజమానిని మెడ కింద పొడిచి బంగారం ఇవ్వాలని బెదిరించారు. షాప్ యజమాని చాకచక్యంగా వ్యవహరించి ప్రతి ఘటించటంతో దుండగులు పారిపోయారు. ఈ సంఘటన లో షాప్ యజమానికి గాయం అయ్యింది. కొంత బంగారం ఎత్తుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.