కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

హుస్నాబాద్ లో బీసీ భవన్, ఫంక్షన్ హాల్, స్టడీ సర్కిల్ లను నిర్మించాలి

మహాత్మ జ్యోతిరావు పూలే కమిటీ కన్వీనర్ పచ్చిమట్ల  రవీందర్ గౌడ్

సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198 వ  జయంతిని పూలే కమిటీ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ  సందర్భంగా చట్టసభలలో విద్య ఉద్యోగ రంగాలలో కేంద్ర ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 42 శాతం రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అమలు చేయాలని పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు, బీసీ సామాజిక వర్గం పెద్ద ఎత్తున ర్యాలీ చేసారు. ర్యాలీ తర్వాత స్థానిక రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో బీసీ చైతన్య సదస్సు బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు  బొలిశెట్టి మాట్లాడుతూ…  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, అన్ని లెక్కలతో కాంగ్రెస్ ప్రభుత్వం నివేదిక తయారు చేసిందని, దీనికి తోడుగా బీసీ సంఘాల నివేదిక కూడా తీసుకుని రేపు చట్టసభలలో న్యాయస్థానాలలో వీగిపోకుండా బీసీలకు న్యాయం జరగాలని లక్ష్యంతో ముందుకు వెళుతుందన్నారు. కమిటీ కన్వీనర్ పచ్చిమట్ల  రవీందర్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు సబ్ ప్లాన్ చట్టం, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు కోటా ప్రకారం చట్టం చేయాలని కోరారు. అదేవిధంగా బీసీ భవన్, బీసీ ఫంక్షన్ హాల్, బీసీ స్టడీ సర్కిల్ హుస్నాబాద్ లో లేకపోవడం వలన బీసీలు ఒక పెళ్లి చేస్తే లక్ష రూపాయల కిరాయి కట్టవలసి వస్తుందని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ 10 కోట్లతో ఆరేపల్లి దాటిన తర్వాత  పల్లె ప్రకృతి వనం వద్ద ఉన్న అసైన్డ్ భూమి రెండు ఎకరాల భూమిలో నిర్మాణం చేయాలన్నారు. మహనీయుల కమిటీ చైర్మన్ లింగాల సాయి అన్న బీసీలది న్యాయమైన డిమాండ్ అని, వారి ఓపికను బలహీనంగా తీసుకోవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. వెంటనే కేంద్రంలో ఉన్న బిజెపి 50 శాతం రిజర్వేషన్ చట్టసభలలో విద్యా ఉద్యోగ రంగాలలో కల్పించాలని, గౌరవ అధ్యక్షులు వడ్డేపల్లి మల్లేశం మాట్లాడుతూ.. కేంద్రంలో  దేశంలో 80 కోట్ల మంది ఉంటే   బీసీ శాఖ మంత్రి లేకపోవడం బాధాకరమన్నారు. అదేవిధంగా మాజీ జెడ్పిటిసి గీకురు రవీందర్ మాట్లడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లకు ప్రత్యేకంగా ఒక కమిటీ, విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి ఒక కమిటీని వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బి. సి నాయకులు కోమటి సత్తన్న, వల్లపు రాజు, పున్న సది,  బుర్ర శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, హుస్నాబాద్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెల్దండి సంతోష్, వరియోగుల అనంత స్వామి  పచ్చిమట్ల శ్రీకాంత్, పూదరి శ్రీనివాస్ గౌడ్, వల్లపు రాజు, కన్నోజు రామకృష్ణ, ఎగ్గోజు సుదర్శన చారి, నాంపల్లి సమ్మయ్య, పచ్చిమట్ల రాదా, కోడూరు శ్రీదేవి, నాయిని రజిత, ఎలగందుల శంకర్, బత్తుల చంద్రమౌళి,  గాదే పాక రవీందర్, వేల్పుల రాజు  తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *