హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి డ్రామాలు, మహిళా కోలాట బృందాలు, కళాకారులు అధిక సంఖ్యలో హాజరై “పౌరాణిక జానపద సాంస్కృతిక జాతర” ను విజయవంతం చేసిన కళా బృందాలు …
కళలకు కానాచి మన హుస్నాబాద్ ప్రాంతం కావాలని కళాకారులకు పిలుపునిచ్చిన మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు వలస సుభాష్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి కళాకారుల ‘పౌరాణిక జానపద సాంస్కృతిక జాతరను’ ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని సంఘమిత్ర బీఈడీ కళాశాలలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న హాజరై కళాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కళలకు కానాచి మన హుస్నాబాద్ ప్రాంతం కావాలని కళాకారులకు పిలుపునిచ్చారు. కళాకారుల ప్రదర్శన ఎంత గొప్పగా ఉందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత అందరి పైన ఉందని, జనం నుండి వచ్చిందే జానపదం పల్లె సిద్ధులు మన పౌరాణిక డ్రామాలు మహిళా కోలాట బృందాలు జానపదమే ప్రాణ పదమని కళాకారులతో అన్నారు. వీటిని భావితరాల అందించేందుకు కృషి చేద్దామని కళాకారులకు పిలుపునిచ్చారు. కళలు ఆజరామరమణి, భారతీయ కలలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, కళలతో మానసిక ఉల్లాసం ఉంటుందని అన్నారు. కళాకారులకు కలలకు రాష్ట్ర ప్రభుత్వం చేతన ఇవ్వాలని, హుస్నాబాద్ నియోజవర్గ స్థాయిలో పౌరాణిక జానపద సంస్కృతి జాతర ఘనంగా జరగడం ఆనందదాయకమని ఆమె అన్నారు.
సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి మాట్లాడుతూ.. సహజంగా ఏర్పడిన కలలే జానపదాలు వాటిని ప్రదర్శించి ప్రతిబింబ చేయడమే నేటి మన మన హుస్నాబాద్ నియోజకవర్గ పౌరాణిక జానపద సాంస్కృతిక జాతర ప్రధాన ఉద్దేశం పేర్కొన్నారు. మన హుస్నాబాద్ ప్రాంతంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ పౌరాణికం కళాకారుల పట్ల మహిళా కోలాట బృందాల కోసం పట్ల సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ కృషి ఆనందదాయకమని, అశేష అనుభవం, కళా నైపుణ్యము ప్రదర్శించే ఈ మహా జాతరకు వచ్చిన కళాకారులకు అభినందనలు తెలియజేశారు. ఈ కళలను సంరక్షించి భావితరాలకు అందించడమే నేటి యువత పైన ఉందని పేర్కొన్నారు. ఇంత అద్భుతంగా ప్రదర్శించిన కళాకారులను అభినందించారు.
సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ మాట్లాడుతూ తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సహకారంతో కళాకారులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. తదనంతరం కళా ప్రదర్శన చేసిన కళాకారులకు అతిథుల చేతల మీదిగా సర్టిఫికెట్లు అందచేశారు. సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ అతిథులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ జై యాదగిరి కోలాటం మాస్టర్ గీత శారద కోలాట నృత్యాలు అబ్బరపరిచాయి. సంకల్ప సంస్థ సభ్యులు ఠాగూర్ బాలాజీ సింగ్ పరశురాములగౌడ్ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
