అపురూపం పూర్వ విద్యార్థుల సమ్మేళనం..
సిద్దిపేట టైమ్స్, చిన్నాకోడూరు,
వారంతా చిన్ననాటి స్నేహితులు. ఒకే చోట చదువుకున్నారు. పదో తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాలలో స్థిరపడగా, మరి కొంతమంది వ్యాపారం ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1996-97లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం చదువుకున్న పాఠశాల లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి, ఆత్మీయ పలకరింపు, నడమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. 28 సంవత్సరాలు తర్వాత కలుసుకున్న వారంతా ఒకరికోకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకుని రోజంతా ఆనందంగా గడిపారు. చాలా రోజుల తర్వాత కలుసుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం పలు కారణాలతో మృతి చెందిన తోటి స్నేహితులను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారికి నివాళులర్పించారు. ఇక నుంచి టచ్ లో ఉండాలంటూ ఫోన్ నెంబర్లు తీసుకోవడం తోపాటు ఈ మధుర జ్ఞాపకాలు తమ తమ సెల్ ఫోన్లో బంధించుకున్నారు. ఆనంతరం అందరూ స్నేహితులు 28 సంవత్సరాలు గడిచిన సందర్భంగా తోటి స్నేహితులతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు రాములు, అంజిరెడ్డి, జగ్గారెడ్డి, చంద్రారెడ్డి, సుందరయ్య, రాంచద్రం, రాజమన్వతి, లక్ష్మి నర్సమ్మ, పాఠశాల ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయుడు లక్ష్మయ్య, వక్తగా ఎజాజ్ అహమ్మద్ వ్యవహరించారు. గత పూర్వ విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.