హుస్నాబాద్ ఆర్టీసీ డిపో లో ఆదర్శ ఉద్యోగుల అభినందన సభ
సిద్దిపేట్ టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డిపో లో డిపో మేనేజర్ డి సి హెచ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మే- 2024 మాసానికి గాను ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆదర్శ ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డు ప్రధానం చేశారు. ఉద్యోగుల పిల్లలకి డాన్స్ ప్రోగ్రాం, ఎస్సే రైటింగ్ ఆక్టివిటీలో పాల్గొన్న వారికి బహుమతులు ప్రధానం చేశారు.
డిపో మేనేజర్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ… లక్ష్య సాధనలో తమ వంతు కృషిలో భాగంగా ప్రతి సర్వీస్ కు అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఫెయిర్ పెయిడ్ ప్యాసింజర్లను ఎక్కించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని, డిపో అభివృద్ధికి పాటుపడాలని డిపో మేనేజర్ ఉద్యోగులకు సూచించారు. మరియు may- 2024 మాసంలో బెస్ట్ E. P. K. మరియు బెస్ట్ కే ఎం పి ఎల్ డ్రైవర్స్, కండక్టర్లకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగులు సలహాలు మరియు సూచనలు తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమంలో డిపో సూపర్ండెంట్ శ్రీధర్, ట్రాఫిక్ సూపర్వైజర్ సమ్మయ్య మరియు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.