సిద్దిపేటలో మరో ఘటన…మల్లికార్జున వైన్స్ లో బీరులో బూజు, చిలుము పట్టిన దృశ్యం
సిద్ధిపేట టైమ్స్ సిద్ధిపేట :
సిద్దిపేట: మద్యం తయారీలో రాష్ట్ర ప్రభుత్వం నాణ్యతలు పాటించడం లేదు. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది. ప్రభుత్వం తీరు అలా ఉంటే.. వైన్స్ నిర్వాహకుల తీరు మరో విధంగా ఉంది. గత 15 రోజుల క్రితం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్లన్న వైన్స్లో మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఓ మద్యం మందుబాబుకి.. మద్యంలో పురుగు రావడంతో షాక్కు గురయ్యాడు. ఈ ఘటన మరువక ముందే… తాజాగా బూర్గుపల్లి సమీపంలోని మల్లిఖార్జున వైన్స్లో బీరు కొనుగోలు చేసిన మరో వ్యక్తికి బీరులో బూజు, చిలుము పట్టిన దృశ్యం దర్శనమిచ్చింది. ఈ క్రమంలో మందు కొనుగోలు చేసిన వ్యక్తి యాజమాన్యంతో వాగ్వాదానికి దిగాడు. మద్యం తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. అనంతరం కొంత మంది కలుగజేసుకుని అతన్ని సముదాయించే ప్రయత్నం చేశారు.







