ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా… వంగ రాజేశ్వర్ రెడ్డి
సిద్దిపేట టైమ్స్ డెస్క్:

చిన్నకోడూరు మండల ప్రజలకు ఏ ఆపద వచ్చిన తనను సంప్రదించవచ్చని, ఎల్లప్పుడూ తాను అందుబాటులో ఉంటానని వంగ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన చిన్నకోడూరులో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురిని కలిశారు. మొదట బబ్బూరి రాజేశ్ కవల పిల్లలు పుట్టగా వారిని ఆశీర్వదించారు. గుడిసె సుశీల్ మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అదే విధంగా తోట ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించారు. అంతకుముందు ఎల్లమ్మ తల్లి ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు రాజేశ్వర్ రెడ్డి ని సన్మానించారు. మర్రి చెట్టు యూత్ సభ్యులు కూడా ఆయన్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్నకోడూరు ప్రజల ఆప్యాయత మరువులేనిదని, మండల ప్రజల కు తన వంతు సేవ చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. అందరూ బాగుండాలని ఎల్లమ్మ తల్లిని ప్రార్థించినట్టు ఆయన తెలిపారు.





