హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల వెంకన్న రజిత
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

హుస్నాబాద్ పట్టణం లో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మెయిన్ రోడ్, బస్టాండ్ ఏరియా, పోలీస్ స్టేషన్, అక్కన్నపేట చౌరస్తా, నాగారం రోడ్డు పూర్తిగా జలమయమయ్యాయి. మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న ఆధ్వర్యంలో నీట మునిగిన ప్రాంతాలను సందర్శించి తగిన సహాయక చర్యలు మునిసిపల్ సిబ్బందితో కలిసి చేపట్టారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాలలో వరద నీటి మళ్లింపు లకు చర్యలు తీసుకున్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని తగు సూచనలు ఇచ్చారు. రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నందున అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి పాడుబడిన ఇండ్లలో, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో ఉండకూడదు శిథిలావస్థలో ఉండే ఇండ్లలో నివసించే వారు వార్డు కౌన్సిలర్ల కి, మున్సిపల్ సిబ్బందికి సమాచారాన్ని అందించినచో స్థానికంగా పునరావాసం కల్పించడం జరుగుతుంది అని అన్నారు. పట్టణ ప్రజలందరూ కూడా ఈ వర్ష భావ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పిల్లలు, పెద్దలు విద్యుత్ స్తంభాల దగ్గర, కరెంట్ లైన్ల కింద, చెట్ల కింద ఉండకూడదు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో అంచనా వేయలేం కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చెప్పారు
ఈ కార్యక్రమంలోమునిసిపల్ ఛైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అయిలేని అనిత మరియు మునిసిపల్ కమీషనర్ T. మల్లికార్జున్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

