ఆసుపత్రిలో సకల సౌకర్యాలు కల్పించాలి..
హెల్త్ సెంటర్ లో కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేయాలి..
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు శ్రీనివాస్ రెడ్డి వినతి..
సిద్దిపేట్ టైమ్స్, దుబ్బాక ప్రతినిధి
దుబ్బాక నియోజకవర్గం లో ఉన్న ప్రతి హెల్త్ సెంటర్ లో వైద్య సిబ్బందిని నిర్మించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి వినతి పత్రం అందజేశారు…. గురువారం రోజున హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలో, పిహెచ్సి హెల్త్ సెంటర్ లో కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించి త్వరలోనే దుబ్బాక నియోజకవర్గం లోని అన్ని సెంటర్లలో నాణ్యమైన వైద్యం అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెరుకు అమరేందర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ దుబ్బాక మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, జిల్లా నాయకులు గడ్డం శ్రీనివాస్ గౌడ్, వెంకట చారి, కుమ్మరి కిషన్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.





