పట్టభద్రులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలి
మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు
సిద్దిపేట టైమ్స్ , దుబ్బాక ప్రతినిదీ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన గొప్ప అవకాశం ఓటు అలాంటి ఓటును ప్రతి ఒక్క పట్టభద్రుడు వినియోగించుకోవాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. గురువారం రోజున అక్బర్పేట్ భూంపల్లి మండలంలో భూంపల్లి హై స్కూల్లో కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. భారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన గొప్ప అవకాశం ఓటు అని, అలాంటి ఓటుని ప్రతి ఒక్క యువత , పట్టభద్రుడు వినియోగించుకున్నప్పుడే వారి ఆశయం నెరవేరుతుందన్నారు. ఈరోజు జరుగుతున్న టీచర్ ఎమ్మెల్సీ , పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు.
