అక్కన్నపేట: చాయ్ తాగేందుకు వచ్చి హోటల్ యజమానికే టోపీ
చాయ్ తాగేందుకు వచ్చి హోటల్ యజమానికే టోపీ
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం
గూగుల్ పే ద్వారా 96000 చోరీ
సిద్దిపేట్ టైమ్స్ కోహెడ:
హోటల్ లో టీ తాగి ఎందుకు వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా ఆ హోటల్ నిర్వాహకుడి ఫోన్ నుంచే గూగుల్ పే ద్వారా 96,000 చోరీ చేసిన ఘటన శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే రాజస్థాన్ కు చెందిన నారాయణ గత ఐదు సంవత్సరాలుగా అక్కన్నపేట మండల కేంద్రంలో రాజ్యస్థాన్ హోటల్ ను నిర్వహిస్తున్నాడు శుక్రవారం హోటల్ కు చత్తీస్గఢ్ కు చెందిన వ్యక్తి టీ తాగేందుకు వచ్చాడు టీ తాగిన తర్వాత తన వద్ద డబ్బులు లేవని తన మిత్రుడు గూగుల్ పే ద్వారా డబ్బులు పంపిస్తాడని ఫోన్ చేసి నెంబర్ చెప్పాలని హోటల్ నిర్వాహకుడిని కోరారు దీంతో హోటల్ నిర్వాహకుడు నారాయణ ఆ వ్యక్తి చెప్పిన నెంబర్ కు ఫోన్ చేయడంతో 500 రూపాయలు అవతలి వ్యక్తి గూగుల్ పే చేశాడు అనంతరం సదురు వ్యక్తి హోటల్ నిర్వాహకుడిని ఒకసారి ఫోన్ ఇవ్వాలని తన స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడతానని తీసుకొని గూగుల్ పే ద్వారా 96,000 తన మిత్రుడికి ఫోన్ నెంబర్కు పంపించాడు పనిలో పడిన సదరు హోటల్ నిర్వాహకుడు పట్టించుకోలేదు తర్వాత చూసేసరికి తన అకౌంట్లో డబ్బులు లేవు తాను మోసపోయినట్లు గుర్తించి వెంటనే అక్కన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హోటల్ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తాండ్ర వివేక్ తెలిపారు.

