యూరియా పంపిణీ విషయంలో ఏఈవో ఇష్టాను రాజ్యం
– నచ్చినవారికి ఇష్టమున్నన్ని యూరియా టోకెన్లు
– వర్షంలో నిలబడిన రైతులకు దొరకని యూరియా
– ముందస్తుగా టోకెన్లు దాచుకున్న ఏఈఓ ” సంతోష్ “
– ఏఈఓపై రైతుల ఆగ్రహం
సిద్దిపేట్ టైమ్స్ , దుబ్బాక ప్రతినిధి
ఒకపక్క వినాయక చవితి , మరోపక్క యూరియా కొరత, ఇలా అనేక ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. బుధవారం రోజున దుబ్బాక పిఎసిఎస్ కార్యాలయంకు యూరియా వచ్చిందని తెలియగానే , వినాయక చవితిని సైతం లెక్కచేయకుండా రైతులు పెద్ద ఎత్తున లైన్ కట్టారు. కానీ వర్షం ఎడతెరిపి లేకుండా కొడుతున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళలు రైతులు గొడుగులు పట్టుకొని క్యూ లైన్ లో నిలబడ్డారు. కానీ యూరియా టోకెన్లు జారీచేసే సంతోష్ తనకు నచ్చిన వాళ్లకు మాత్రమే అదనంగా టోకెన్ ఇవ్వడంతో ఉదయం నుండి లైన్ లో వేచి ఉన్న రైతులకు యూరియా అందలేదు. దీంతో రైతులు ఏఈఓ సంతోష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈఓ సంతోష్ ముందుగానే తన అనుచర వర్గానికి సుమారు 40 నుండి 50 బ్యాగుల వరకు టోకెన్లు ముందుగానే అందించాడు. ఏది ఏమైనా రైతులు ఉదయం నుండి అటు వర్షాన్ని ఇటు పండుగను కూడా లెక్కచేయకుండా లైన్లో వేచి ఉన్న , ఏఈఓ చేసిన పనితీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈఓ సంతోష్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.






