హుస్నాబాద్ మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ గా అడిషనల్ కలెక్టర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ ప్రతినిధి :
మున్సిపాలిటీల పాలకమండలి పదవీకాలం ముగియడంతో సోమవారం నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగనుంది. ఈ మేరకు హుస్నాబాద్ మున్సిపాలిటీకి అడిషనల్ కలెక్టర్ ను స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. హుస్నాబాద్ మునిసిపాలిటీ పాలకవర్గం గడువు కూడా ఈనెల 26వ తేదీతో ముగియడంతో హుస్నాబాద్ మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్ గా సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ నియామకం కాగా సోమవారం ఆయన బాధ్యతలను స్వీకరించారు. పాలకమండలి గడువు తీరడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలనలో భాగంగా పూర్తిస్థాయి బాధ్యతలను స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను మున్సిపల్ కమిషనర్ టి మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలుకుతూ శాలువా తో సన్మానించారు.