ప్రభుత్వ భూమి కబ్జా.. అక్రమంగా వెంచర్ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.. -సిపిఐ
ది సిద్దిపేట్ టైమ్స్, బెజ్జoకి;
బెజ్జంకి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం పక్కన ఉన్న 643 సర్వే నంబర్ లో 15 ఎకరాల 9 గంటల భూమి కలదు ఇందులో అక్రమంగా కొంత భూమిని వెంచర్ ఏర్పాటు చేసి ఇట్టి సర్వే నంబర్ లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల నాయకులు సంగెం మధు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సంగెం మధు మాట్లాడుతూ 643 సర్వే నెంబర్ లో సర్వేయర్ తో ఎమ్మార్వో హద్దులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు, అట్టి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వానికి పనికి వచ్చే విధంగా ఉపయోగించాలని సూచించారు అంతేకాకుండా స్థానిక ఎంపీడీవో లేఅవుట్ ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందన్నారు ఇద్దరూ మండల అధికారులు పర్యవేక్షించడంలో లోపం జరుగుతుందన్నారు నిత్యం అదే దారిలో వచ్చేటువంటి అధికారులు చూసీ చూడనట్లు వదిలేయడంపై ఆంతర్యం ఏంటిదో తెలియదన్నారు సర్వే నంబర్ లో సర్వేయర్ తో హద్దులు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దొంతరవేణి మహేష్ బోనగిరి శ్రావణ్ కల్లూరు బాలమల్లు రొడ్డ చరణ్ తదితరులు పాల్గొన్నారు.