అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూల్ లపై చర్యలు తీసుకోవాలి
ఎస్ఎఫ్ఐ సహ కార్యదర్శి గగులోతు రాజు నాయక్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ పట్టణంలోని అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకుడు గుగులోతు రాజు నాయక్ విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు.
ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు వ్యతిరేకంగా రకరకాల ఫీజుల పేరు తోటి వేలాది రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలలు అడ్మిషన్ పేరిట ప్రభుత్వం నిబంధనల ప్రకారం స్కూల్లో పాఠ్యపుస్తకాలు, టై, బెల్ట్, బూట్లు, విద్యార్థుల బట్టలు ఏవి కూడా పాఠశాలలో అమ్మకూడదని ప్రభుత్వ నిబంధన ఉన్నప్పటికీ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పట్టించుకోకుండా వ్యాపారమే ధ్యేయంగా వివిధ రకాల ఫీజుల పేరుతోటి వేలాది రూపాయలు అక్రమ వసూలు చేస్తూ విద్యార్థులను తల్లితండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ జీవో నెంబర్ 42 ను తక్షణమే అమలు చేసి ప్రవేట్ విద్యాసంస్థలలో దోపిడిని అరికట్టి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ స్కూల్ లలో పేద విద్యార్థులకు 25% ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాల్సి ఉండగా వాటిని అమలు చేయకపోవడం వలన పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తక్షణమే విద్యా హక్కు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ స్కూల్లో అధిక ధరలకు అమ్ముతున్న పాఠ్య పుస్తకాలను, వివిధ రకాల ఫీజుల పేరుతో వసూలు ను ఆపివేయాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పుస్తకాలు అమ్ముతున్న ప్రవేట్ పాఠశాలలో అదేవిధంగా వివిధ రకాల ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై ప్రత్యక్షoగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. తక్షణమే అధికారులు స్పందించి ఆ స్కూల్లో పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.