బతుకమ్మ టెండర్ల అవకతవకలపై చర్యలు తీసుకోవాలి
బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
బతుకమ్మ టెండర్ల అవకతవకలపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ అన్నారు. చిన్న బతుకమ్మ , పెద్ద బతుకమ్మ టెండర్ల విషయంలో టెండర్ల వివరాలు ఎవరికీ తెలియకుండా టెండర్ ప్రకటన ఏ పత్రికలో ఇచ్చారో, బాక్స్ టెండర్లకు సంబంధించి ఎప్పుడు పెట్టారో తెలియదనీ, టెండర్ విషయాలు నోటీస్ బోర్డ్ లో అంటించకపోవడానికి కారణమేమిటి అని అన్నారు. మున్సిపల్ ఏఈ ని అడిగితే ఏ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడో వివరాలు ఎందుకు చెప్పడం లేదని, ఇంత రహస్యం పాటించవలసిన అవసరం ఏంటని మున్సిపల్ అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.గత పది సంవత్సరాలుగా ఆన్ లైన్ టెండర్లు హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన వారికే రావడం జరుగుతుందనీ బయటి వారిని ఇక్కడికి రాకుండా కొంతమంది పట్టణ కాంట్రాక్టర్లు అడ్డుకుంటున్నారనీ అన్నారు. ఇప్పుడు దాదాపు 12 లక్షల రూపాయలకు టెండర్లు వేయడం జరిగిందనీ అయితే బయటి జిల్లాల కాంట్రాక్టర్లు వస్తే పట్టణానికి సంబంధించిన వారి కంటే బయటి కాంట్రాక్టర్లే తక్కువ మొత్తానకి పనులు చేస్తారు కాబట్టి టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ఎప్పుడు పనుల వద్దకు రాడనీ అన్నారు. ఇందులో కొంతమంది కౌన్సి లర్లు ఈ పనులను దగ్గరుండి చేస్తున్నారనీ లైట్లకు, డెకరేషన్ కి సంబంధించి, ఎక్కడ లేని రేట్లు అధికంగా ఇక్కడనే ఉంటున్నాయనీ తెలిపారు. పలు వార్డులలో మొరం, మట్టి పోస్తామంటూ టెండర్ తగ్గించుకున్న కాంట్రాక్టర్ మట్టి మొరం పోయడం లేదు. బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. పలు వీధి గుంతలలో మట్టి ఎప్పుడు పోస్తారో తెలియజేయాలని బీఎస్పి పార్టీ పక్షాన కోరారు. ప్రధాన ప్రతిపక్షాలైన బిజెపి , కాంగ్రెస్ ఇట్టి టెండర్ల అవకతవకలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి నాయకులు ఎలగందుల శంకర్, డేగల వెంకటేష్, సుధాకర్, వేల్పుల రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.