హుస్నాబాద్ లో ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం… ప్రాణాలతో బయటపడ్డ దంపతులు
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైన ఘటన హుస్నాబాద్ పట్టణం పద్మశాలి కాలనీలో చోటు చేసుకుంది. బాధితులు కాలనీవాసులు అందించిన సమాచారం మేరకు హుస్నాబాద్ పట్టణంలోని పద్మశాలి కాలనీలో తోపుడు బండి కార్మికుడిగా పనిచేస్తున్న గీకురు కనకయ్య, భార్య లక్ష్మితో కలిసి జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రోజున అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు మంటలు చెలరేగడంతో స్పృహలోకి వచ్చిన దంపతులు బయటకు వచ్చి ఆర్తనాదాలు చేయగా కాలనీవాసులు మేల్కొని గృహవసరాలకు ఉపయోగించే వాటర్ మోటార్స్ తో, బకెట్లతో పంటలను ఆర్పి వేశారు. జరిగిన అగ్నిప్రమాదంలో గృహప్రకరమైన వస్తువులు, బట్టలు, రెండు సైకిళ్ళు, పిండి బస్తాలు, బియ్యం తదితర వస్తువులు దగ్ధమయ్యాయని జరిగిన ఘటనలో సుమారు రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని గీకూరు లక్ష్మి బోరున విలపించింది. కూలి నాలి చేసుకుని బ్రతికే తమను ప్రభుత్వం కోవాలని గీకూరు కనకయ్య దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు.





