రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ ;
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందిన ఘటన హుస్నాబాద్ లో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం….సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పూల్ నాయక్ తండ గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి బర్మావత్ మనోహర్ (27) తన సొంత బైకు పై కరీంనగర్ కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా బైక్ అదుపుతప్పి కరెంటు పోల్ కు ఢీకొని మృతి చెందాడు. కాగా మనోహర్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసి గత మూడు నెలల క్రితం సొంత గ్రామానికి తిరిగి వచ్చాడు. అనంతరం హైదరాబాదులో సొంతగా సాఫ్ట్ వేర్ కంపెనీ నడిపిస్తున్నాడని వారి బంధువులు తెలిపారు. సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో సొంత గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కరీంనగర్ కు బైకుపై వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక్కసారిగా బైక్ అదుపు తప్పి ఎదురుగా ఉన్న కరెంటు పోల్ ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకొని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Posted inహుస్నాబాద్
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం





