మైనర్ బాలుణ్ణి లోబర్చుకొన్న మహిళ..
కేసు నమోదు చేసిన పోలీసులు..

సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి:
మైనర్ బాలుణ్ణి బలవంతంగా లోబర్చుకొన్న ఓ మహిళ పై ఫోక్సో కేసు నమోదు చేసిన సంఘటన సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిద్దిపేట టూ టౌన్ పోలీసులు తెల్పిన వివరాల ప్రకారం.. సోలంకి రాధ అనే మహిళ తన భర్త విజయ్ తో కలసి సిద్దిపేట పట్టణ పరిధిలోని హనుమాన్ నగర్ లో మూడు సంవత్సరాల క్రితం అద్దెకి ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో సదరు మహిళ ఇంటి యజమాని కుమారుడు అయిన మైనర్ బాలుణ్ణి బలవంతంగా శారీరకంగా లోబర్చుకుందని తెలిపారు. కొన్ని రోజులు గడిచాక రాధ తన భర్త, పిల్లల్ని వదిలి పెట్టీ మైనర్ బాలునితో కలిసి ఇంట్లో నుండీ కొంత నగదు, బంగారం తీసుకొని చెన్నై పారిపోయింది. బాలుడు కనిపించడం లేదని తల్లి పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు తనని ఎలాగైనా పట్టుకుంటారని మహిళ అలోచించి ఈ నెల 11నా బాలుణ్ణి సిద్దిపేటలో వదిలిపెట్టింది. బాలుణ్ణి పోలీసులు విచారించగా తనను రాధ అనే మహిళ బలవంతంగా శారీరకంగా లోబర్చుకొని తాను తీసుకెళ్లిన డబ్బులు ఖర్చు చేసి బంగారం ను అమ్మి జల్సాలకు ఖర్చు చేసినట్లు తెలిపాడు. సదరు మహిళను శనివారం పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కి తరలించినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.




