బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం హుస్నాబాద్ బంద్ కు పిలుపునిచ్చిన హిందూ సంఘాల ఐక్యవేదిక.
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

బంగ్లాదేశ్ లో హిందువులపైన జరుగుతున్న అత్యాచారలు, దాడులకు ఘోరమైన ఆకృత్యాలకు , హింసకు హిందువుల ధన, మాణ ప్రాణాలు హరించుకుపోవడాన్ని నిరసిస్తూ శనివారం హుస్నాబాద్ బంద్ కు సహకరించాలని హిందూ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ గౌరిశెట్టి ప్రకాష్, విశ్వహిందూ పరిషత్ భార్గవపురం (హుస్నాబాద్) ఖండ ప్రముఖ్ చందుపట్ల నాగరాజు కోరారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…ఇటీవల బంగ్లాదేశ్ లో ఎగిసిపడ్డ రిజర్వేషన్ల ఉద్యమం అక్కడి ప్రభుత్వ మార్పిడికి, ఘోరమైన హింసకు నిలయమై హిందూ ఆడ బిడ్డల పైన, హిందూ దేవాలయాల పైన జరుగుతున్న మారణకాండకు హిందువుల ధన, మాన ప్రాణాలు హరించుకు పోతున్నాయన్నారు. ఈ దాడులకు నిరసనగా పట్టణ ప్రజలు అందరూ ఈనెల 17న స్వచ్ఛందంగా పార్టీలకతీతంగా అందరూ బందు లో పాల్గొని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు పట్టణ ప్రజలంతా మద్దతు ప్రకటించాలని కమిటీ సభ్యులు కోరారు. అలాగే హుస్నాబాద్ పట్టణ బంద్ కు ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి హిందువుల సంఘటిత శక్తిని నిరూపించాలని, హుస్నాబాద్ బంద్ ను విజయవంతం చేయాలని , ఇందుకుగాను పట్టణంలోని వర్తక వాణిజ్య వ్యాపారస్తులు, సినిమా హాళ్లు, స్కూళ్లు, కాలేజీల యాజమానులు స్వచ్ఛంద బందు పాటించి విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చందుపట్ల నాగరాజు, కాయిత భాస్కర్ రెడ్డి, చిట్టీ దేవేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, దొడ్డి శ్రీనివాస్, శంకర్ బాబు, లక్ష్మణ్, రాకేష్, కర్ణాకంటి నరేష్, అనంతస్వామి, వీరాచారి, రాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.