సిద్దిపేట వేంకటేశ్వర స్వామికి శఠగోపం..!దేవుడి ఆస్తులను మింగిన ప్రబుద్ధుడు..రూ.కోట్ల విలువ చేసే భూమి అమ్మకం..ఆస్తులు కాపాడాలంటూ భక్తుల ఆందోళన..‌‌‌‌జిల్లా కలెక్టర్.. దేవాదాయ శాఖ  దృష్టి పెట్టాలని విజ్ఞప్తి..

సిద్దిపేట వేంకటేశ్వర స్వామికి శఠగోపం..!దేవుడి ఆస్తులను మింగిన ప్రబుద్ధుడు..రూ.కోట్ల విలువ చేసే భూమి అమ్మకం..ఆస్తులు కాపాడాలంటూ భక్తుల ఆందోళన..‌‌‌‌జిల్లా కలెక్టర్.. దేవాదాయ శాఖ  దృష్టి పెట్టాలని విజ్ఞప్తి..

సిద్దిపేట వేంకటేశ్వర స్వామికి శఠగోపం..!
దేవుడి ఆస్తులను మింగిన ప్రబుద్ధుడు..
రూ.కోట్ల విలువ చేసే భూమి అమ్మకం..
ఆస్తులు కాపాడాలంటూ భక్తుల ఆందోళన..
‌‌‌‌జిల్లా కలెక్టర్.. దేవాదాయ శాఖ  దృష్టి పెట్టాలని విజ్ఞప్తి..

సిద్దిపేట టైమ్స్, మెదక్ బ్యూరో, ఆగస్టు 14

సిద్దిపేట శ్రీ వేంకటేశ్వర స్వామికే శఠగోపం పెట్టాడు ఓ ప్రబుద్ధుడు..  దేవస్థానం కమిటీ వంశపారంపర్య  చైర్మన్ గా ఉంటూనే దేవుడి ఆస్థులను కాజేస్తున్నాడు. సిద్దిపేట కు చెందిన ఓ ప్రముఖ నేత, మాజీ మంత్రి, ఓ మాజీ జిల్లా కలెక్టర్ అండదండలతో  సిద్దిపేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవుడి భూమిని ఆక్రమించుకుని అమ్ముకున్నాడు అతడు. మళ్లీ తమకేమీ తెలియదన్నట్లు ఆ కుటుంబం వంశపారంపర్య చైర్మన్ గా కొనసాగుతూ..  మరిన్ని దేవుడి ఆస్తులు, డబ్బులు దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. దేవస్థానానికి చెందాల్సిన భూమిని దేవుడికి చెందకుండా కబ్జాకు పాల్పడుతుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారిస్తున్నారు.  రూ. కోట్ల విలువ చేసే నాలుగు ఏకరాల దేవుడి భూమి అన్యాక్రాంతానికి గురైంది. ‘కాపాడండి సారూ..’ అంటూ  భక్తులు లబోదిబోమంటూ నెత్తినోరు మొత్తుకుంటున్నా సంబంధిత అధికారులకు మాత్రం పట్టించుకోవడం లేదు.
ఇదీ పరిస్థితి..


సిద్దిపేట జిల్లా సిద్ధిపేట మోహినిపుర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వుంది. ఈ దేవస్థానానికి రెవెన్యూ శాఖ 1991 మే 19న సిద్ధిపేట మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని సర్వే నెం.1340లోని 5ఎకరాల 3గుంటల భూమిని కేటాయించింది. అదే రోజున దేవస్థానం ఉద్యానవనం పేరుతో అప్పటి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వాసుదేవారెడ్డి సమక్షంలో శిలాఫలకం కూడా వేయడం జరిగింది. అప్పుడు ఈ దేవస్థానానికి చైర్మన్ గా వెంకటనర్సయ్య ఉన్నారు. రిటైర్డు ఆర్టీవో కూడా అయిన వెంకట నర్సయ్య వేంకటేశ్వర స్వామి దేవస్థానం వంశపారంపర్య చైర్మన్  తానేనంటూ దేవస్థానానికి ప్రభుత్వం కేటాయించిన భూమిని తన పలుకుబడిని ఉపయోగించుకుని 4ఎకరాల 3గుంటల భూమిని తన పేరు మీద పట్టాగా మార్చుకున్నాడు. మిగతా ఎకరా 3గుంటల భూమిని దేవస్థానానికి చెందే విధంగా 38వ రిజిష్టర్లో చూపించారు. కానీ కొన్నేళ్ళ నుంచి దేవస్థానానికి చెందిన భూమిని రిటైర్డు ఆర్డీవో ఆధీనంలోనే వున్నట్లు చూపించారు. అయితే ఈ భూమిలో పెంచుతున్న మామిడి తోట నిర్వహణకు, కరంటు మోటారుకు, కరంటు బిల్లులకు, కాపలాదారునికి మాత్రం దేవస్థానం నిధులనే వెచ్చిస్తున్నాట్లు రికార్డులో స్పష్టంగా  చూపించారు.
రూ.కోట్లల్లో ధర…
ప్రస్తుతం ఆ భూమికి రూ.కోట్లలో ధర పలుకుతోంది. సిద్దిపేటకు హైదరాబాద్ రహదారికి అనుకుని ఉండటంతో ఆ భూమి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.  దీంతె ఆ భూమిపై ఆ ప్రబుద్ధుడి కన్ను పడింది. ఆ భూమిలో సాగు చేస్తున్న  మామిడి తోట నిర్వహణకు సంబంధించి దేవస్థానం నుంచి డబ్బులు ఖర్చు చేశాడు. దేవస్థానం సిబ్బంది, దేవస్థానం రికార్డుల్లో ప్రతిపైసా ఖర్చు రాసిపెట్టారు. అయితే ఆ భూమి మోహినిపుర శ్రీ వేంకటేశ్వర స్వామికి చెందినది అని రికార్డులు సైతం స్పష్టం చేస్తున్నాయి. కానీ ఆ ప్రబుద్ధుడు స్థానిక నేతలు, అధికారుల అండదండలతో ఒక సంవతరం క్రితం దర్జగా కబ్జా చేసి.. అమ్ముకున్నాడు. ఆ భూమిలో ఉన్న మామిడి తోటను తొలగించి కంచ నాటారు. ఆ భూమి పలువురి చేతులు  కూడా మారింది. ఈ తతంగం అంతా స్థానిక ఓ మాజీ మంత్రి, ఓ మాజీ కలెక్టర్ సహాయ సహకారలతో జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
భక్తుల ఉద్యమం…
దేవస్థానానికి చెందిన ఆ భూమిని దేవస్థానానికి అప్పగించాలంటూ సిద్ధిపేటలో కొందరు భక్తులు ఉద్యమం చేస్తున్నారు.  కొన్ని రోజుల నుంచి స్థానికి దేవస్థానం కార్యనిర్వహణాధికారితో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, మెదక్ జిల్లా దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. దేవస్థానానికి రెవెన్యూ శాఖ కేటాయించిన భూమిలో దేవస్థానం డబ్బులు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తే, ఆ భూమిని దేవస్థానం చైర్మన్ గా కొనసాగుతున్న వ్యక్తి ఇతరులకు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ దేవాలయ భూములను కాపాడాలంటూ పోరాటం చేస్తున్నారు. కొట్లాది రూపాయల విలువ చేసే ఈ భూమిని చైర్మన్ గా కొనసాగుతున్న వ్యక్తి ఇతరులకు విక్రయించాడు. ఈ క్రయ విక్రయాల పై రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్  ఫిర్యాదు చేస్తున్నట్ల స్పష్టం చేశారు. ఈ భూములకు, తోట నిర్వహణకు ఖర్చు చేసిన రికార్డులను దేవస్థానంలోని  కొందరు కలిసి మాయం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని, దేవస్థానంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, వీరివల్ల ఆలయం ప్రతిష్టకు భంగం కలగడమే కాకుండా దేవస్థానానికి రావల్సిన ఆదాయం దేవుడికి రాకుండా పోయిందని ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *