
ఉత్కంఠకు తెర.. రైతులను ఒడ్డుకు చేర్చిన ఎస్డిఆర్ఎఫ్ బృందం
– రైతులు ఒడ్డు కి చేరడంతో గ్రామస్థుల హర్షం
– అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన చిన్ననిజాంపేట గ్రామస్థులు
– వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– జాయింట్ కలెక్టర్ మహ్మద్ హమీద్
సిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లి
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో టెన్షన్ టెన్షన్ వాతావరణంకి పులిస్టాప్ పడింది.. అక్బర్ పేట భూంపల్లి మండలం పోతరెడ్డిపేట పెద్ద చెరువు భారీగా మత్తడి ప్రవాహం పెరగడంతో అటుగా వెళ్లిన చిన్న నిజాంపేట రైతులు వ్యవసాయ పొలాల వద్ద చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎస్ డిఆర్ఎఫ్ బృందాలను ఆశ్రయించారు.
రంగంలోకి దిగిన ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు రైతులను కాపాడ్డానికి బోటు సహాయంతో రైతుల వద్దకు వెళ్లే ప్రయత్నం ప్రారంభించారు . వరద ఉదృతి ఎక్కువగా ఉండడంతో ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది శ్రమించాల్సి పరిస్థితి ఏర్పడింది . రైతులకు ఇబ్బందులు కలగకుండా బోటు సహాయంతో పోలీసులు బయటికి తీసుకువచ్చారు. ఎంతగానో శ్రమించి ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం రైతులను గ్రామానికి తీసుకురావడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు . రాత్రి నుండి ఒంటరిగా ఉన్న రైతులను క్షేమంగా తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అధికారులకు, పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు . ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా రైతులు వరద నుండి బయటికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . రైతులను రిస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చిన ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బందిని జాయింట్ కలెక్టర్ అబ్దుల్ అహ్మద్ ,అభినందించారు.ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ మల్లికార్జున్ రెడ్డి,దుబ్బాక సిఐ శ్రీనివాస్,యెస్ ఐ హరీష్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.







