సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్
తెలంగాణ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో తెలంగాణ ఉద్యమకారులు మాజీ ఎంపీల ఆత్మీయ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపిలు ప్రస్తుత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మేల్యేలు వివేక్ వెంకట్ స్వామి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజయ్య, మధుయాష్కి గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కర్ తదితరులు.
ఈ ఆత్మీయ సమావేశానికి ప్రత్యేకంగా హాజరైన ఏఐసిసి ఇంచార్జి దీపాదాస్ మున్షి, సమావేశంలో ఆనాటి తెలంగాణ ఉద్యమ ఘటనలను, పోరాటాలను స్మరించుకున్న నేతలు, అనంతరం కలిసి లంచ్ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు.

