పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ కు వినతి
సిద్దిపేట టైమ్స్ సిద్దిపేట జూలై 24 :
పట్టు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ
సిద్దిపేట జిల్లా పట్టు రైతుల సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాదులో రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ కమిషనర్ షేక్ యాస్మిన్ భాష కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా పట్టురైతుల సంఘం అధ్యక్షులు పెద్దోళ్ల ఐలయ్య మాట్లాడుతూ రైతులు పండించిన పట్టు గూళ్లకు ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్లలో కంటే ధర కిలోకు100 నుంచి 200 రూపాయలు తక్కువ రావడంతో ఇక్కడ రైతుల నష్టపోతున్నారని అన్నారు. సరైన ధర రైతులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కెట్లో పట్టుగుళ్లు అమ్మిన రోజే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. డబ్బులు లేటుగా రైతులకు అందడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెండింగ్ లో ఉన్న ఇన్సెంటివ్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు అందేలా చూడాలని కోరారు. పట్టుపురుగు లకు వినియోగించే మందులను, పరికరాలను సబ్సిడీపై రైతులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టు రైతుల సహకార సంఘం నాయకులు పెద్దోళ్ల నర్సింలు, పి. యాదగిరి, బి. నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.