ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే ప్రజా నేత..
హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన..
సమస్యలపై వినతులు స్వీకరణకు విస్తృత స్పందన..
ఈ నెల 21 నుండి హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన పర్యటిస్తా
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన చేశారు. ప్రజా సమస్యలపై ప్రజల వద్దకే ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ పర్యటన లో భాగంగా చిగురు మామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవర పల్లి మండలాల్లో మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో విసృత సమావేశంలో ఏర్పాటు చేసి ప్రజా దర్బార్ లో తక్షణమే ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. ప్రజల నుండి వ్యక్తిగత సమస్యలతో పాటు గ్రామ అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామంలోని వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అందులో తక్షణమే పరిష్కారం అయ్యే సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.
గ్రామాల్లో వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో విద్యుత్, తాగు నీటి లేకుండా చూడాలని, స్కూల్ లలో జరుగుతున్న పనులు ఏమైనా పెండింగ్ లో ఉంటే త్వరగా పూర్తి చేయాలని కోరారు.. వర్షాకాలం సమీపిస్తుండటంతో గ్రామాల్లో పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా దోమల విషయంలో కూడా ముందస్తు జాగ్రతలు చేపట్టాలని తెలిపారు. పలు గ్రామాలకు ఆర్టీసి బస్సు రావడం లేదని, సీసీ రోడ్ల నిర్మాణం, మురుగు కాలువల నిర్మాణం లాంటివి పూర్తి చేయాలని స్థానిక ప్రజలు మంత్రి ని కోరారు.
తనని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గా గెలిపించారని వారు ఇచ్చిన అవకాశం తో మంత్రి అయి సేవ చేయడానికి వచ్చానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి తొడ్పడతానని ఎంతా బిజీగా ఉన్న తనని గెలిపించిన ప్రజల సమస్యలు తీర్చడానికి నేరుగా మండలాలు గ్రామాల్లోకి వస్తున్నానని పేర్కొన్నారు. ఈ నెల 21 నుండి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన పర్యటిస్తానని నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తేవాలని ఎప్పటికీ హుస్నాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటానని మంత్రి పొన్నం వెల్లడించారు.. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ప్రథమ స్థానంగా నిలబెట్టడమే లక్ష్యంగా పని చేస్తానని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు,గ్రామ శాఖల అధ్యక్షులు, జడ్పీటిసి, ఎంపిటిసి లు, ఎంపీపీలు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.


