“సర్దార్ సర్వాయి పాపన్న” పేరిట పోస్టల్ స్టాంపు విడుదల చేయాలి
తెలంగాణ కల్లుగీతా కార్మిక సంఘం
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
పట్టణంలోని ఎల్లమ్మ గుడి వద్ద తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు కోయడ కొమురయ్య మాట్లాడుతూ అతి సామాన్యమైన కుటుంబం నుండి అప్పటి రాజరిక వ్యవస్థకు సంబంధించి, జాగిర్దారులు భూస్వామ్య దారులు చేసే దోపిడీలకు వ్యతిరేకంగా ప్రజారాజ్యం స్థాపించేందుకు 12 మంది తో తిరుగుబాటు ప్రారంభించి ఆ సైన్యంతో చివరికి గోల్కొండ కోటను జయించి ఔరంగజేబును ఓడించి ఏడు నెలలు పరిపాలించాడు. హుస్నాబాద్ సంఘం మండల అధ్యక్షులు మాట్లాడుతూ బ్రిటిష్ రాజులు చెప్పే వరకు ఇంగ్లాండ్ దేశ మ్యూజియంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం గురించి మనకు తెలియదు. ఆయన జీవిత చరిత్రకు సంబంధించి యూరప్ దేశాలలో కూడా పుస్తకాలు విడుదల అయ్యాయి. రాజుల కుటుంబం,లో పుట్టకపోయిన రాజుల అండ దండ లేకపోయినా పదునైనా ఆయుధాలతో గోల్కొండ కోటను జయించిన ధైర్యశాలి అని, ప్రజలకు సమాన హక్కు స్వేచ్ఛ ఉండాలని అతడు పరిపాలించిన ఏడు నెలలు కాలంలోనే చూపించాడు అన్నారు. అగ్రవర్ణ వ్యతిరేక శక్తులు ఆయన చరిత్రను దాచి పెట్టాలని చూసిన లండన్ మ్యూజియం మన దేశానికి చూపించింది. ఈ సందర్భంగా బహుజనులందరూ ఇటువంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆయన పేరిట స్టాంపు విడుదల చేయాలని తెలంగాణ కల్లుగీతా కార్మిక సంఘం పక్షాన కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోయడ కొమురయ్య, మండల అధ్యక్షులు పచ్చిమట్ల రవీందర్ గౌడ్, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు పూదరి రవీందర్ గౌడ్, నాయకులు బత్తిని లక్ష్మయ్య గౌడ్, పూదరి చంద్రమౌళి గౌడ్, తాళ్లపల్లి లక్ష్మణ్ గౌడ్, వడ్లకొండ శ్రీనివాస్ గౌడ్,కోహెడ శ్రీనివాస్ గౌడ్, పాకాల సమ్మయ్య గౌడ్,పూదరి చిన్న రవీందర్ గౌడ్, పచ్చిమట పెద్ద రవీందర్ గౌడ్, పూదరి మహేందర్ గౌడ్, కోయడ బాలయ్య, పూదరి కుమార్, పూదరి వెంకటేష్, జాగిరి మల్లేశం, తాళ్లపల్లి రాజయ్య, సూదుల నరసయ్య, గట్టు మల్లేశం, పూదరి పెద్ద రవీందర్ తదితరులు పాల్గొన్నారు.





