హుస్నాబాద్ లో పిడుగుపాటుకు పాడి గేదె మృతి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం లోని GR రెడ్డి కాలనీ సమీపంలో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగు పడి పట్టణానికి చెందిన మర్యాల రామ్ రెడ్డి తండ్రి ఎల్లారెడ్డి చెందిన పాడి గేదె మృతి చెందింది. రామ్ రెడ్డి రెండు గేదలను కొనుక్కొని పాల ఉత్పత్తి చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటున్నాడు. కానీ ఆదివారం సాయంత్రం పాలు పిండుకొని వచ్చి తిరిగి తెల్లవారుజామున మళ్లీ పాలు పిండడానికి వెళ్ళేసరికి రాత్రి పడ్డ పిడుగులకు ఒక పాడి గేదే చనిపోయి ఉన్నదని కుటుంబ సభ్యులు తెలిపారు. గేదె మృతితో ఆ కుటుంబం జీవనోపాధి కోల్పోయారని కావున రైతు రామ్ రెడ్డిని ప్రభుత్వం ఆదుకోని ఆర్థిక సహాయ చేయాలని గ్రామస్తులు కోరారు.
Posted inతాజావార్తలు హుస్నాబాద్
హుస్నాబాద్ లో పిడుగుపాటుకు పాడి గేదె మృతి
