సిద్దిపేట టైమ్స్ హైదరాబాద్ డెస్క్
జూబ్లీహిల్స్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRDI) లో ఆషాఢ మాసం బోనాల జాతర – 2024 పై అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిధులుగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్.
ఆషాఢ మాసం బోనాల జాతర ను విజయవంతం చేసుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు , శాంతి భద్రతలు ,దేవాలయాల వద్ద భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లు తదితర అంశాల పై సమీక్షా సమావేశంలో చర్చించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల
విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ ,వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.