డీజే నిర్వాహకుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పోతారం (జె) గ్రామంలో పండుగ పూట విషాద ఘటన చోటు చేసుకుంది. డీజే నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైపోయింది. శనివారం రాత్రి గ్రామంలోని దుర్గామాత డిజే వద్ద తేలి ఉన్న కరెంటు వైర్ కాలికి తగిలి విద్యుత్ ఘాతంతో చిన్నారి కీర్తన్య (8) అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. డీజే నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మృతి చెందిందంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. డీజే నిర్వాహకులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.