కళాకారులకు చైర్ పర్సన్ ఆత్మీయ సన్మానం
“పొట్టేల్” మూవీ బాగుందని ప్రశంస
మరింత ముందుకు సాగాలని సూచన
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
హుస్నాబాద్ కళాకారులు నటించిన “పొట్టేల్” సినిమా సందేశాత్మకంగా ఉందని, స్థానికులంతా తప్పకుండా చూడాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న పిలుపునిచ్చారు. పొట్టేల్ సినిమాలో నటించిన స్థానిక కళాకారులు ముక్కెర సంపత్ కుమార్, తాడూరి సురేష్, బోనగిరి రజితలను శనివారం నాడు మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… హుస్నాబాద్ ప్రాంతం కళాకారులకు పుట్టినిల్లు అని అన్నారు. సినిమా పరిశ్రమలో మనవాళ్లు ఎదగడం ఎంతో అభినందనీయమన్నారు. పొట్టేలు మూవీలో సామాజిక చైతన్యం కలిగిన సందేశం ఉందని, ప్రజలందరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.