మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో బైక్ లో పెట్రోల్ పోస్తుండగా ఒక్కసారిగా మంటలు
సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:
బైక్ లో పెట్రోల్ పోస్తుండగా మొబైల్ రింగ్ అవడంతో మంటలు ఏర్పడిన ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగింది. మొబైల్ వల్ల మంటలు ఏర్పడ్డాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఫోన్ నుంచి వెలువడే విద్యుదయస్కాంత తరంగాలు సమీపంలోని మెటల్ కండక్టర్స్‌తో కలిసి ఎలక్ట్రిక్ స్పారన్ను పుట్టిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు మొబైల్ ద్వారా చెల్లింపులు చేస్తుండటంతో ఈ ప్రమాదం ఆందోళన కలిగిస్తోంది.