అడ్డగోలుగా మాట్లాడితే సహించం
మంత్రి పొన్నం పై ఆరోపణలు తగవు
కౌశిక్… ఓ బ్లాక్ మెయిలర్
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై బొమ్మ ఫైర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
రాష్ట్ర హౌజ్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి బుధవారం మీడియాతో మాట్లాడుతూ… హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధారాల్లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం సరికాదు అంటూ, సీఎం, మంత్రులు, ప్రభుత్వంపై ఆధారాల్లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. ఫైయాష్ తరలింపుపై మంత్రి పొన్నంపై కౌశిక్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దమ్ముంటే యాష్ తరలింపుపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి ఎన్ని అక్రమాలు చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. ఫ్లై యాష్ రాష్ట్రానికి సంబంధం ఉండదని, అది వేస్ట్ మెటీరియల్ గా దానిని బయటకు అమ్ముతారని, ఈ విషయంలో మంత్రి పొన్నంకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఫై యాష్ ట్రాన్స్పోర్టుకు వే బిల్ కూడా ఉండదని దీనిపై ఎమ్మెల్యేకు కనీస పరిజ్ఞానం లేకపోవడం సిగ్గుచేటన్నారు. కౌశిక్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తూ.. బ్లాక్మెయిల్ స్టార్ గా మారాడన్నారు. కమిషన్లు ఇవ్వకపోవడంతోనే విమర్శలు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుపుతున్న బూడిద తరలింపులో వే బిల్స్ ఉండవని, లారీల ఓవర్ లోడ్ గురించి కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. బి ఆర్ ఎస్ అంటేనే అవినీతి అని అందుకే ఆ పార్టీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారన్నారు.వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.





