హుస్నాబాద్ లో బిజెపి విజయోత్సవ ర్యాలీ
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:



కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ఫలితాలలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ 225000 పై చిలుకు ఓట్లతో విజయం సాధించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షులు వెల్దండి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి గాంధీ మల్లె చెట్టు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కార్యకర్తల నృత్యాలు బానసంచాలు పేల్చుకుంటూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థానిక మంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన హుస్నాబాద్ నియోజకవర్గ ఓటరులు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారని ఈ సందర్భంగా ఓటర్లందరికి కృతజ్ఞతలు తెలిపినారు మరియు హుస్నాబాద్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అభ్యర్థి బండి సంజయ్ కి మెజారిటీ ఇవ్వడం పట్ల హుస్నాబాద్ ప్రజలకు ధన్యవాదములు తెలిపినారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు,లక్కీరెడ్డి తిరుమల మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి,తోట స్వరూప ఓ బి సి మోర్చా జిల్లా అధ్యక్షులు,బొమ్మగాని సతీష్ అక్కన్నపేట మండల అధ్యక్షులు,మహేందర్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శిలు, తగరం లక్ష్మణ్, చందు మండల ప్రధాన కార్యదర్శులు,సంపత్ నాయక్, మహేశ్వర్ రెడ్డి బొల్లీ శ్రీనివాస్ బి జె వై ఎం జిల్లా అధికారప్రతినిధి భూషంకర్,పట్టణ మండల అధ్యక్షులు,పోలోజు రాజేందర్, కుమారస్వామి, శక్తి కేంద్ర ఇన్చార్జిలు,మహేష్కర్, రాంప్రసాద్, నాగార్జున,సీనియర్ నాయకులు,చిట్టి గోపాల్ రెడ్డి,వేముల దేవేందర్ రెడ్డి, గుత్తికొండ విద్యాసాగర్,బోనగిరి రవీందర్,వెలదండి సంతోష్, బత్తుల శంకర్,వీరచారి, అనంతస్వామి,కురుమెల్లి శ్రీనివాస్ తోట సమయ్య, మల్లం ప్రశాంత్, అరుణ్ రవీండర్, రైనా నాయక్ బూత్ అధ్యక్షులు,లక్ష్మయ్య,, రాంరెడ్డి, రాజేష్,సాంబరాజు, శేఖర్,వెంకటేష్,సాయికృష్ణ,నరేష్ రమేష్ ,కొంకటి కిషోర్, గణేష్ అనిత కార్యకర్తలు, బిజెపి అభిమానులు&మహిళలు పాల్గొన్నారు.