నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన మెజారిటీ నాలో మరింత బాధ్యతను పెంచింది
హుస్నాబాద్ ను ఆదర్శ నియోజకవర్గంగా చేస్తా
రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:
కరీంనగర్లో పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల అందరి ఆశీర్వాదంతో 5 నెలల క్రితం ఎమ్మెల్యేగా గెలిచాను. నా కుటుంబ సభ్యులైన కార్యకర్తల కృషితో ఈ ఎన్నికల్లో కూడా 23 వేల 128 ఓట్ల మెజారిటీ ఇచ్చిన మీ అందరికీ చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్న, గతంలో గెలిచినప్పుడు రుణపడి ఏ విధంగా సేవ చేస్తానని అన్నానో 5 నెలలుగా నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేస్తున్న, మీరు ఇచ్చిన ఆశీర్వచనం నన్ను ప్రోత్సహించిందని అన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని గత ఎన్నికల్లో చెప్పిన విధంగా ఆదర్శ నియోజకవర్గంగా, తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గం అంటే గల్లా ఎత్తుకునేల చేస్తానని, ఈ ఫలితాలు నామీద మరింత బాధ్యతను పెంచాయి అని అన్నారు.
ఈ ఓట్లు రావడానికి కారణమైన హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులకు, మండల అధ్యక్షులకు, బూత్ స్థాయి నాయకులకు, క్లస్టర్ ఇంచార్జి, అనుబంధ సంఘాలు, nsui, యూత్ కాంగ్రెస్ వారంతా శ్రమించారు వారికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.





