
హుస్నాబాద్ మున్సిపల్ పట్టణం శివారు ప్రాంతమైన కరీంనగర్ రోడ్డులో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ వద్ద సాయంత్రం 6 గంటలకు హుస్నాబాద్ డిపోకు చెందినTS 36 T 7471 నెంబర్ గల హైర్ విత్ బస్సు కరీంనగర్ నుండి హుస్నాబాద్ కు వస్తుండగా ఎదురుగా వచ్చిన AP 01 AD 8160 గల ద్విచక్ర వాహనం బజాజ్ డిస్కవర్ ను ఢీకొని ద్విచక్ర వాహనంపై గల కోహెడ మండలానికి చెందిన వ్యక్తి వయస్సు (45) అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న హుస్నాబాద్ ఎస్సై తోట మహేష్, పోలీసు బృందం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి, ఆర్టీసీ అధికారులకు, అంబులెన్స్ ను పిలిపించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు, కేసు వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.