గ్రామపంచాయతీ కార్యాలయానికి గులాబీ కలర్

గ్రామపంచాయతీ కార్యాలయానికి గులాబీ కలర్

గ్రామపంచాయతీ కార్యాలయానికి గులాబీ కలర్


అభ్యంతర వ్యక్తం చేసిన వార్డు సభ్యులు,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు

సిద్దిపేట టైమ్స్, ధూళిమిట్ట:

ధూళిమిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి శనివారం గులాబీ కలర్ వేశారు.విషయం తెలుసుకున్న పలువురు వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు గ్రామ పంచాయతి కార్యాలయానికి చేరుకుని అభ్యంతర వ్యక్తం చేశారు. ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన గులాబీ కలర్ ను గ్రామపంచాయతీ కార్యాలయానికి ఎలా వేస్తారని సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు పంచాయతీ సిబ్బందిని నిలదీశారు. దీంతో ఒక్కసారి అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డిని వివరణ కోరగా త్వరలో గ్రామసభ ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ పాలకవర్గం అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Leave a Comment

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *