పిలిస్తే చాలు… వెంటనే స్పందన
27వ డివిజన్ కార్పొరేటర్ అనీల్ కుమార్
సిద్దిపేట టైమ్స్, వరంగల్ ఈస్ట్ :
వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలోని 27వ డివిజన్లో ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ముందుండే నాయకుడిగా కాంగ్రెస్ కార్పొరేటర్ చింతాకుల అనీల్ కుమార్ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించారు. అబ్బణికుంట ప్రాంతంలో రహదారి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసిన వెంటనే అనీల్ కుమార్ అక్కడికి చేరుకుని సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ఆలస్యం చేయకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్డుపని తక్షణమే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు. దీంతో స్థానికుల సమస్య వెంటనే పరిష్కారమైంది. ప్రజల పిలుపు వచ్చిన ప్రతీసారి స్పందించి, అభివృద్ధి పనుల్లో ముందుండే అనీల్ కుమార్ తీరును చూసి ప్రాంతీయులు ప్రశంసలు కురిపిస్తున్నారు. “మనకు భవిష్యత్తులో కూడా అన్నే కావాలి” అంటూ ఆయనకు మద్దతు తెలియజేస్తున్నారు.





