గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గందే మల్లేశం
కత్తెర గుర్తుకే మన ఓటు
సిద్దిపేట టైమ్స్,ధూళిమిట్ట(డిసెంబర్,12):
ధూళిమిట్ట మండలంలో బైరాన్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గందే మల్లేశం గెలుపు దిశగా గడప గడపకు తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు.ఈ సందర్బంగా శుక్రవారం గ్రామంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందజేయడంలో ముందుంటానని, ప్రజా సమస్యలే నా సమస్యలుగా భావించి పరిష్కార దిశగా అడుగులు వేస్తానని అన్నారు. తనకు ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తానని మల్లేశం హామీ ఇచ్చారు.
Posted inతాజావార్తలు హుస్నాబాద్
గెలుపు దిశగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గందే మల్లేశం




