మద్యానికి బానిసై ఉరి వేసుకుని వ్యక్తి మృతి
సిద్దిపేట టైమ్స్,మద్దూరు(డిసెంబర్, 11):
మద్యానికి బానిసై మనస్థాపానికి గురై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మద్దూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండలం కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన చిలుక రాజేష్(30) గత కొన్ని రోజులుగా ఇంటి వద్దనే ఉంటూ ఏం పని చేయకుండా, మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం 6 గంటలకు మనస్థాపనికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఒక భార్య, ఒక కుమార్తె ఉన్నారు.మృతుని భార్య చిలుక కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ షేక్ మహబూబ్ ప్రకటనలో తెలిపారు.
Posted inమద్దూరు
మద్యానికి బానిసై ఉరి వేసుకుని వ్యక్తి మృతి





