తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అమోఘం
ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ముద్రను తుడిచేయడం ఎవరివల్లా కాదు
హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు
విజయ్ దివస్ సందర్భంగా తెలంగాణ తల్లి కి పాలాభిషేకం
సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :
ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ అవిశ్రాంత పోరాటం చేశారని, ఇందులో వారి పాత్ర అమోఘమని, ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ముద్రను తుడిచి వేయడం ఎవరివల్లా సాధ్యం కాదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు విజయ్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. కేసీఆర్ దీక్ష వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కేసీఆర్ కుటుంబం పై అనేక విమర్శలు చేస్తూ కాలం గడుపుతూ ప్రజల కోసం చేసింది ఏమీ లేదన్నారు. కేసీఆర్ 2009 నవంబర్ 29 న ఆమరణ నిరాహార దీక్షకు దిగి 11 రోజులపాటు చేసిన దీక్ష ఫలితంగానే ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం మేమే ఇచ్చాం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించవలసిన విషయం ఏమిటంటే అసలు కేసీఆర్ పోరాటం చేయకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముద్రను తుడిచి వేయడానికి ప్రయత్నం చేస్తున్నదని ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్ త్యాగాన్ని ప్రజలు ఎప్పుడూ మర్చిపోరని, ఇప్పటికైనా అనవసరపు విమర్శలు మానుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి, సుద్దాల చంద్రయ్య, పట్టణ అధ్యక్షుడు అన్వర్ పాషా, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, సీనియర్ నాయకులు కన్నోజు రామకృష్ణ, వంగ వెంకట్రాంరెడ్డి, గూళ్ళ రాజు, ఆయుబ్ ,బొజ్జ హరీష్, వాలె నవీన్, సారయ్య, భాగ్యరెడ్డి, చొప్పరి శ్రీనివాస్, బండి పుష్ప, మేకల వికాస్ యాదవ్, జీవన్, స్వరూప, జేరిపోతుల సునీత, రాజు నాయక్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Posted inతాజావార్తలు హుస్నాబాద్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అమోఘం





